
- జీరో అవర్‌లో బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట్రామ్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ జీరో అవర్‌లో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించారు. నిజామాబాద్‌లో పసుపు రైతుల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ప్యారా నగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రస్తావించారు. ఇక.. బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట్రామ్ రెడ్డి జీరో అవర్ లో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
ఎస్డీఎఫ్ కింద తన నియోజకవర్గానికి రూ.85లక్షలు తక్కువ నిధులు ఇచ్చారని, కొడంగల్‌కు మాత్రం వెయ్యి కోట్లు ఇచ్చారని మండిపడ్డారు. అసెంబ్లీలో 84 ప్రశ్నలు అడిగితే ఎనిమిది ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారని, తాను ఆర్టీఐ కింద 86 ప్రశ్నలు అడిగి తే సమాధానం ఇవ్వటం లేదని వివరించారు. నియోజకవర్గానికి ఏంతెచ్చా రని ప్రజలు తమను నిలదీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.